ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ వాక్-ఇన్-ఇంటర్వ్యూ నోటిఫికేషన్ 2025
👉 కేటగిరీ: Agricultural Jobs | Govt Jobs in AP
ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్, తిరుపతి లో టీచింగ్ అసోసియేట్స్ & టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు 10 సెప్టెంబర్ 2025 ఉదయం 10:00 గంటలకు తిరుపతిలోని RARS, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ (IFT) లో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఖాళీలు & అర్హతలు
1. టీచింగ్ అసోసియేట్
- సంబంధిత సబ్జెక్టులో Ph.D లేదా మాస్టర్స్ డిగ్రీ
- కనీసం 4/5 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ
- అన్ని డిగ్రీలు ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాలల నుండే ఉండాలి
2. టీచింగ్ అసిస్టెంట్
- B.Sc (Ag)/B.Tech (Ag.Engg) నాలుగు సంవత్సరాల డిగ్రీ
- తప్పనిసరిగా ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండే పూర్తి చేసి ఉండాలి
వయో పరిమితి
- టీచింగ్ అసోసియేట్: పురుషులకు గరిష్టం 40 సంవత్సరాలు, మహిళలకు 45 సంవత్సరాలు
- టీచింగ్ అసిస్టెంట్: గరిష్టం 35 సంవత్సరాలు
జీతం (Salary)
- నెలకు ₹35,000/- నుంచి ₹67,000/- వరకు
- Ph.D కలిగిన వారికి HRA రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత రేట్ల ప్రకారం చెల్లిస్తారు
అప్లికేషన్ విధానం
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్, పుట్టిన తేదీ రుజువు, మరియు విద్యా అర్హతల జిరాక్స్ కాపీలుతో పాటు 10.09.2025 ఉదయం 10:00 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ ప్రదేశం:
RARS, Institute of Frontier Technology (IFT), తిరుపతి
ముఖ్యమైన లింకులు
Notification PDF – Click Here
Official Website – Click Here
