Ap Anganwadi Jobs 2025: 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Apply Now | Telugu Jobs 2025
Ap Anganwadi Jobs 2025: అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడి ఆయా ఉద్యోగుల కోసం అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కింద కేవలం 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉండాలి. తమ గ్రామంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఈనెల 17 లోపల దరఖాస్తు చేయాలి.**
ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి ఉద్యోగాల ఖాళీలు:
శిశు సంక్షేమ శాఖ ద్వారా వేలూరు జిల్లాలో చింతలపూడి, బుట్టయాల గూడెం, ఉడుగూరు, జంగాల రెడ్డి గూడెం, నూజివీడు & కైకలూరు మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కింద అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్ & అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం సంబంధిత ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సంప్రదించాలి.
అంగన్వాడి ఉద్యోగాలు అర్హత వివరాలు:
- స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి
- పదో తరగతి పాస్ అయి ఉండాలి
- 01 జులై 2024 నాటికి వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
అంగన్వాడి ఖాళీ వివరాలు:
మండలం | పోస్టుల వివరాలు |
---|---|
చింతలపూడి | 01x మినీ అంగన్వాడీ c 01x అంగన్వాడి ఆయా |
బుట్టయాల గూడెం | 02x అంగన్వాడీ టీచర్, 03x అంగన్వాడి ఆయా |
ఉడుగూరు | 03x అంగన్వాడి ఆయా |
జంగాల రెడ్డి గూడెం | 01x మినీ అంగన్వాడీ టీచర్, 01x అంగన్వాడి ఆయా |
నూజివీడు | 01x అంగన్వాడి ఆయా |
కైకలూరు | 01x అంగన్వాడీ టీచర్, 07x అంగన్వాడి ఆయా |
అంగన్వాడి ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- 10వ తరగతి మార్క్ మెమో
- Income Certificate
- నివాస ధ్రవీకరణ పత్రం
- తాజా Passport Size Photos
ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల లోపు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
అంగన్వాడి ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 2025 ఏప్రిల్ 03
- దరఖాస్తు ముగింపు: 2025 ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల లోపు
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):
- అంగన్వాడీ పోస్టులకు ఎవరెవరు దరఖాస్తు చేయవచ్చు?
- స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు. వయస్సు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుందా?
- అధికారిక సమాచారం ప్రకారం, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
- దరఖాస్తు ఫారం ఎక్కడ లభిస్తుంది?
- సంబంధిత ICDS కార్యాలయంలో లభిస్తుంది.
- 10వ తరగతి పూర్తి కాలేదు, అంగన్వాడీ సహాయకురాలిగా దరఖాస్తు చేసుకోవచ్చా?
- కాదు, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైతే అంగన్వాడీ సహాయకురాలి పోస్టుకు అర్హత ఉంటుంది.
- దరఖాస్తు సమర్పణకు ఏవైనా ప్రత్యేక డాక్యుమెంట్లు అవసరమా?
- అవును, పదో తరగతి ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్థానిక నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాలి.
ఇంతవరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను అందించాం. మరిన్ని వివరాలకు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయాన్ని సంప్రదించండి.
Leave a Comment