AP Collector Office Jobs 2026: 7th, Any Degree అర్హతతో కలెక్టర్ కార్యాలయంలో 29 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు – పరీక్ష లేదు, ఫీజు లేదు
AP Collector Office Jobs 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో కలెక్టర్ కార్యాలయం, ఏలూరు నుండి Group-4 బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులకు మొత్తం 29 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు లేదు.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ
- ఉద్యోగ స్థానం: కలెక్టర్ కార్యాలయం, ఏలూరు
- రిక్రూట్మెంట్ టైప్: బ్యాక్‌లాగ్ (Divyang Candidates కోసం)
- మొత్తం ఖాళీలు: 29
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో క్రింది పోస్టులు ఉన్నాయి:
- జూనియర్ అసిస్టెంట్ (Junior Office Assistant)
- టైపిస్ట్
- ఆఫీస్ సబార్డినేట్
- గ్యాంగ్ మిట్టూర్
విద్యార్హతలు
- జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం
- ఆఫీస్ సబార్డినేట్: కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు (01-07-2026 నాటికి)
జీతం వివరాలు
- జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్: ₹25,220 – ₹80,910
- ఆఫీస్ సబార్డినేట్: ₹21,000 – ₹61,960
అప్లికేషన్ ఫీజు
- ఫీజు లేదు
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులను కింది ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు:
- వైకల్య శాతం: 20 మార్కులు
- వయస్సు: 20 మార్కులు
- ఎంప్లాయిమెంట్ సీనియారిటీ: 10 మార్కులు
ఈ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
దరఖాస్తు విధానం (Offline)
అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి:
- జనన ధ్రువపత్రం
- విద్యార్హత సర్టిఫికేట్లు
- ఎంప్లాయిమెంట్ కార్డు
- వైద్య ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఆధార్, రేషన్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
అన్ని పత్రాలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి, కింది అడ్రస్‌కు సమర్పించాలి:
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ,
కల్లెక్టరేట్ ప్రాంగణం, ఏలూరు
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 01-04-2026
- చివరి తేదీ: 21-04-2026 (సాయంత్రం 5 గంటల వరకు)
ముఖ్య గమనికలు
- ఈ ఉద్యోగాలు పశ్చిమ గోదావరి జిల్లా స్థానికులకు మాత్రమే వర్తిస్తాయి
- కేవలం దివ్యాంగ అభ్యర్థులకు మాత్రమే ఈ బ్యాక్‌లాగ్ పోస్టులు
- గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు
Tags
AP Collector Jobs 2026, AP Govt Jobs, Eluru Collector Office Jobs, Group 4 Jobs AP, 7th Pass Govt Jobs, Degree Jobs AP, No Exam Govt Jobs, AP Backlog Jobs, Disabled Quota Jobs AP, Offline Jobs AP
