ఆంధ్రప్రదేశ్ మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP WDCWD Jobs Recruitment 2025 | AP Contract Basis Jobs
AP WDCWD Contract Basis Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం నందు ఏర్పాటు చేయబడిన వన్ స్టాప్ సెంటర్ నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ ఉద్యోగ భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ వివరాలు:
🔥 సంస్థ: జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు
🔥 మొత్తం ఖాళీలు: మొత్తం 3 ఉద్యోగాలు
🔥 ఉద్యోగాల వివరాలు:
- సైకో సోషల్ కౌన్సిలర్ – 01 (జనరల్)
- మల్టీ పర్పస్ స్టాఫ్/ కుక్ – (ఎస్సీ)
- సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ – (ఎస్సీ)
విద్యార్హతలు:
- సైకో సోషల్ కౌన్సిలర్ (మహిళ): సైకాలజీ, సైకోమెట్రీ లేదా న్యూరో సైన్స్ విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- మల్టీ పర్పస్ స్టాఫ్/ కుక్: హైస్కూల్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
- సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్: ప్రభుత్వ/గుర్తింపు పొందిన సంస్థలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. రిటైర్డ్ మిలిటరీ/పారా మిలిటరీ అభ్యర్థులకు ప్రాధాన్యత.
వయస్సు పరిమితి:
25 నుంచి 42 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కట్ ఆఫ్ తేదీ: 01/07/2025.
దరఖాస్తు విధానం:
🔥 అప్లికేషన్ విధానం:
- అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఫార్మేట్‌ను ఫిల్ చేసి సంబంధిత ధృవపత్రాలతో పోస్టు ద్వారా లేదా నేరుగా కార్యాలయానికి అందజేయాలి.
🔥 చిరునామా: జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి, తలారసింగి, బాలసదనం ప్రక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, Pin: 531024.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం:
- సైకో సోషల్ కౌన్సిలర్: ₹20,000/-
- మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్: ₹13,000/-
- సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్: ₹15,000/-
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 02/04/2025
- దరఖాస్తు చివరి తేదీ: 15/04/2025
👉 నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయడానికి: [Click Here]
Leave a Comment