💼 PMEGP Loan 2025: నిరుద్యోగులకు పండగే!
ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (PMEGP) 2025లో యువతకు స్వయం ఉపాధికి నూతన దారి చూపిస్తోంది. రూ.25 లక్షల వరకు బ్యాంక్ లోన్, అలాగే రూ.9 లక్షల వరకు సబ్సిడీ లభించే అవకాశం ఈ పథకం ద్వారా ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం.
✅ PMEGP స్కీమ్ యొక్క ముఖ్య ప్రయోజనాలు:
- 👉 గ్రామీణ ప్రాంతాల్లో యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు
- 👉 SC, ST, BCలకు ప్రత్యేకంగా 35% వరకు సబ్సిడీ
- 👉 పట్టణ ప్రాంతాలకు 25% వరకు సబ్సిడీ
- 👉 బ్యాంక్ లోన్ పై ప్రభుత్వ సహాయం
- 👉 EDP Training తో ఉచిత వ్యాపార శిక్షణ
📌 ఎలా అప్లై చేయాలి? Step-by-Step Guide
1. బ్యాంక్ లోన్ అప్రూవల్ పొందండి
ముందుగా మీరు చేయాల్సింది మీ వ్యాపార ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ బ్యాంకులో లోన్ అప్లై చేయడం. లోన్ అప్రూవల్ లెటర్ తీసుకోవాలి.
2. PMEGP పోర్టల్ లో రిజిస్ట్రేషన్
వెబ్సైట్: 👉 https://www.kviconline.gov.in/pmegp/
అక్కడ ఆధార్, పాన్ వంటి వివరాలు నమోదు చేయాలి.
3. ఏజెన్సీ ఎంపిక చేసుకోండి
మీ ప్రాంతానికి అనుగుణంగా ఈ మూడు ఏజెన్సీలలో ఒకటి ఎంచుకోండి:
- ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్
- ఖాదీ అండ్ విలేజ్ బోర్డు
- డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ (DIC)
4. వెరిఫికేషన్ ప్రాసెస్
ఎంపిక చేసిన ఏజెన్సీ మీ వ్యాపారం వాస్తవంగా ఉన్నదా లేదా అని పరిశీలన చేస్తుంది.
5. EDP Training పూర్తిచేయాలి
ఈ ట్రైనింగ్ 15 క్లాసులు, 15 పరీక్షలతో ఉంటుంది. అండ్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (EDP) సర్టిఫికేట్ తప్పనిసరి.
6. సబ్సిడీ విడుదల
ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
📊 ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి?
- చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ప్రిపేర్ చేయించండి
- వ్యాపారం పేరు, వ్యయాలు, లాభాలు, బ్రేక్ ఈవెన్ పాయింట్ మొదలైనవి వివరంగా ఉండాలి
- బ్యాంక్ కు సమర్పించాకే అప్రూవల్ పొందవచ్చు
🏦 సబ్సిడీ ఎంత దాకా వస్తుంది?
ప్రాంతం | గరిష్ట సబ్సిడీ శాతం | గరిష్ట సబ్సిడీ మొత్తం (రూ.) |
---|---|---|
గ్రామీణ ప్రాంతాలు | 35% | ₹8,75,000 వరకు |
పట్టణ ప్రాంతాలు | 25% | ₹6,25,000 వరకు |
📢 గమనికలు:
- 👉 ప్రైవేట్ బ్యాంకులు PMEGP సబ్సిడీ అందవు
- 👉 ప్రాజెక్ట్ విలువ ఎక్కువైతే, బ్యాంక్ రిస్క్ కూడా పెరుగుతుంది
- 👉 ముందుగా స్థానిక ఖాదీ/DIC ఆఫీసు నుంచి సమాచారం సేకరించండి
🔗 ఇంకా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్
👉 https://www.kviconline.gov.in/pmegp/
|
|
🏷️ Tags:
PMEGP 2025
, PMEGP Loan Apply
, PMEGP Subsidy
, PMEGP Loan Eligibility
, Unemployment Schemes India
, PMEGP Training
, Self Employment Yojana
Leave a Comment