RBI Assistant Recruitment 2026: తెలుగు భాష వస్తే చాలు.. గ్రామీణ బ్యాంకులలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
RBI Assistant Recruitment 2026: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన RBI Assistant Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16, 2026 నుండి ప్రారంభమై మార్చి 08, 2026 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
RBI Assistant Recruitment 2026 ముఖ్య వివరాలు
సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్
మొత్తం ఖాళీలు: 650
దరఖాస్తు ప్రారంభం: 16 ఫిబ్రవరి 2026
చివరి తేదీ: 08 మార్చి 2026
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ మాత్రమే
దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో పోస్టులు ఉన్నాయి. అహ్మదాబాద్ – 20, బెంగళూరు – 24, భోపాల్ – 30, భువనేశ్వర్ – 18, చండీగఢ్ – 20, చెన్నై – 53, గౌహతి – 36, హైదరాబాద్ – 11, జైపూర్ – 11, జమ్మూ – 10, కాన్పూర్ & లక్నో – 50, కోల్‌కతా – 29, ముంబై – 249, నాగ్‌పూర్ – 16, న్యూఢిల్లీ – 49, పాట్నా – 17, తిరువనంతపురం – 06 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత & వయస్సు పరిమితి
వయస్సు 01/02/2026 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02/02/1998 ముందు మరియు 01/02/2006 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (SC/ST/PwBD అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది) ఉండాలి. కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం తప్పనిసరి. దరఖాస్తు చేస్తున్న రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం రావాలి.
ఎంపిక విధానం
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. Preliminary Examination, Main Examination మరియు Language Proficiency Test (LPT) ద్వారా ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర భాషలో LPT పరీక్ష రాయాలి. భాషలో ప్రావీణ్యం లేకపోతే అభ్యర్థి అనర్హుడిగా పరిగణించబడతారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు www.rbi.org.in వెబ్‌సైట్‌కి వెళ్లి Recruitment for the Post of Assistant – Panel Year 2025 లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించాలి. చివరగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
పరీక్ష ఫీజు వివరాలు
SC/ST/PwBD/EXS అభ్యర్థులకు ₹50 + 18% GST. General/OBC/EWS అభ్యర్థులకు ₹450 + 18% GST. ఫీజు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
జీతం & అలవెన్సులు
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ మూల వేతనం ₹29,000/- ఉంటుంది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రారంభ స్థూల జీతం సుమారు ₹58,514/- ఉంటుంది. అదనంగా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మరియు ఇతర బ్యాంక్ ప్రయోజనాలు లభిస్తాయి.
Tags
RBI Assistant Recruitment 2026, RBI Jobs Telugu, RBI Assistant Vacancy 2026, RBI Assistant Eligibility, RBI Assistant Salary, RBI Assistant Apply Online, Bank Jobs 2026 Telugu, RBI Notification 2026
