Responsive Search Bar

Uncategorized

Railway Jobs 2025-26: రైల్వే శాఖలో 22000+ గ్రూప్ డి అసిస్టెంట్ ఉద్యోగాలు – షార్ట్ నోటిఫికేషన్ విడుదల

Railway Jobs

Railway Jobs 2025-26 : రైల్వే శాఖలో 22000+ గ్రూప్ డి అసిస్టెంట్ ఉద్యోగాలు – షార్ట్ నోటిఫికేషన్ విడుదల

భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా RRB NTPC Group D Assistant Recruitment 2025-26 కి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో కలిపి సుమారు 22000కి పైగా గ్రూప్ డి లెవల్-1 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు ఇద్దరికీ ఇది గొప్ప అవకాశం.

RRB NTPC Group D Assistant Recruitment 2025 – ముఖ్య వివరాలు

  • సంస్థ పేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)
  • ఉద్యోగ రకం : పర్మనెంట్ (శాశ్వితం)
  • పోస్టు పేరు : గ్రూప్ డి లెవల్-1 అసిస్టెంట్
  • మొత్తం ఖాళీలు : 22000 (సుమారుగా)
  • దరఖాస్తు మోడ్ : ఆన్లైన్
  • అధికారిక వెబ్‌సైట్ : www.rrbapply.gov.in

RRB Group D పోస్టుల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్‌లో కింది అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి:

  • అసిస్టెంట్ (S & T)
  • అసిస్టెంట్ వర్క్‌షాప్
  • అసిస్టెంట్ బ్రిడ్జ్
  • అసిస్టెంట్ క్యారేజ్ & వాగన్
  • అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్ / ఎలక్ట్రికల్)
  • అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)
  • అసిస్టెంట్ P.Way
  • అసిస్టెంట్ TL & AC
  • అసిస్టెంట్ ట్రాక్ మెషిన్
  • అసిస్టెంట్ TRD
  • పాయింట్స్‌మన్-B
  • ట్రాక్ మెయింటైనర్-IV

విద్యా అర్హత (Educational Qualification)

RRB Group D Assistant ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే:

  • 10వ తరగతి ఉత్తీర్ణత
    లేదా
  • ITI / NAC (NCVT అప్రూవ్‌డ్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి (Age Limit)

  • కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు

వయో సడలింపు:

  • OBC (NCL) అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
  • SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

నెల జీతం (Salary Details)

ఈ గ్రూప్ డి అసిస్టెంట్ పోస్టులకు:

  • ₹18,000/- నుండి ₹56,900/- వరకు నెల జీతం
  • ఇతర అలవెన్సులు (DA, HRA, TA) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము (Application Fee)

  • OC / OBC : ₹500/-
  • SC / ST / EWS / మహిళలు / మాజీ సైనికులు / PWD : ₹250/-

ఫీజు చెల్లింపు ఆన్లైన్ మోడ్‌లోనే (Debit Card / Credit Card / UPI / Net Banking) చేయాలి.

ఎంపిక విధానం (Selection Process)

RRB Group D ఎంపిక ప్రక్రియలో ఈ దశలు ఉంటాయి:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  2. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
  4. మెడికల్ పరీక్ష (ME)

పరీక్ష తేదీల సమాచారం SMS / Email ద్వారా తెలియజేస్తారు.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభం : 21 జనవరి 2026 (ఉ. 10:00 గంటలకు)
  • దరఖాస్తు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2026 (రాత్రి 12:59 గంటల వరకు)

ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)

అభ్యర్థులు https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి, రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన లింకులు

Notification 


Official Website 

Tags 
RRB Group D Recruitment 2025, Railway Jobs 2025, RRB NTPC Group D Assistant Notification, Railway Assistant Jobs, 10th Pass Railway Jobs, ITI Railway Jobs, Group D Jobs 2025, Indian Railway Recruitment, RRB Apply Online, Central Government Jobs, Latest Railway Notification 2025, Railway Group D Vacancy, Sarkari Naukri Railway, RRB Jobs 2025

WhatsApp