📰 తాజా వార్తలు: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అల్లూరి జిల్లా, ట్రెండింగ్AP డెస్క్:
Volunteer System Ap Pawan Kalyan Comments: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తన అరకు పర్యటనలో వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. అరకులోని కురిడి గ్రామాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్, అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
🔹 “వాలంటీర్లకు ప్రభుత్వ ఉద్యోగమని మభ్యపెట్టారు”
ఈ సందర్భంగా స్థానిక వాలంటీర్లు విధుల్లోకి తిరిగి తీసుకోవాలంటూ పవన్‌ను కోరారు.స్పందించిన పవన్ , గత ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారన్నారు.
అలాగే ఆయన పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
- 👉 గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి జీవో (G.O) లేకుండా పనిచేసింది
- 👉 ప్రభుత్వం దగ్గర వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఏమైనా అధికారిక డాక్యుమెంట్ లేవు
- 👉 వాలంటీర్లకు ప్రభుత్వ ఉద్యోగమని తప్పుడు హామీలు ఇచ్చారు
- 👉 ఎన్నికల సమయంలో వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినా, నిబంధనలు లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం అని ప్రశ్నించారు
🌱 అభివృద్ధిపై హామీ
పవన్ కల్యాణ్ తన దత్తత గ్రామం కంటే ఎక్కువ అభివృద్ధి పనులు కురిడిలో జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. అరకులో అభివృద్ధిని పరిపూర్ణంగా చూపిస్తానని మరోసారి హామీ ఇచ్చారు
|
|
Tags: #PawanKalyan #APVolunteers #VolunteerSystemAP #ArakuTour #AndhraPradeshNews #TrendingAP #PawanSpeech
Leave a Comment